'ఇస్మార్ట్ శంకర్' గా అలరించనున్న రామ్

SMTV Desk 2019-01-03 18:46:45   Ram Pothineni, Puri Jagannadh, First Look

ఇటీవల విజయాలు లేని రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వొక సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యారు. పూరి నిర్మాతగా , చార్మీ సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని రామ్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ .. ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

తెలంగాణ యాసతో ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ను ఈ సినిమాకి ఖరారు చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, గెడ్డంతో రామ్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే రామ్ పాత్ర స్వభావం కూడా డిఫరెంట్ గానే ఉండేలా అనిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా తెలుగు అమ్మాయినే తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా మిగతా వివరాలను తెలియజేసే ఛాన్స్ వుంది