రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుండి సంక్రాంతి కానుక

SMTV Desk 2019-01-02 19:41:22  Tamilnadu, State government, Governor, Banwarilal purohith, Assembly, Sankranti festival, Gift hamper

న్యూ ఢిల్లీ, జనవరి 2: నేడు తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పర్వదినాన బహుమతులు ఇవ్వనుంది అని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అన్నారు. నిరుపేద ప్రజలు కూడా పండగను ఘనంగా జరుపుకునే చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదుతో పాటు ఓ గిప్ట్ హ్యాంపర్ అందించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బన్వరిలాల్ పురోహిత్ ప్రభుత్వం తరపున మాట్లాడుతూ సంక్రాంతికి ప్రభుత్వం అందించనున్న సహాయం గురించి ప్రకటించారు. అయితే ఇందుకోసం తమిళ నాడు ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది.

కేవలం రేషన్ కార్డు వున్న కుటుంబాలకే వెయ్యి రూపాయలు అందిచనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులకు లోనైన అంటే గజ తుఫాను, ఉత్తర తమిళనాడులో కరువు బారిన పడ్డ ప్రాంతాల్లోని ప్రజలకు పండగా సరుకులతో కూడిన గిప్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరు తమ రేషన్ కార్డు ద్వారా వెయ్యి రూపాయలతో పాటు ఈ సరుకులను కూడా తీసుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.