శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళామణులు..

SMTV Desk 2019-01-02 12:11:57  Shabarimala temple, Supreem court, Ayyappa women devotes

కేరళ, జనవరి 2: శబరిమలలో సుప్రీం కోర్టు తీర్పు తరువాత మొట్ట మొదటి సారి ఇద్దరు మహిళలు ఆలయ లోకి ప్రవేశించారు. రుతుస్రావం వయస్సు కలిగిన మహిళలు ఆలయ ప్రవేశం చేయడంతో దశాబ్దాలపాటు కొనసాగుతున్న ఆలయ చరిత్రను తిరగరాసినైట్లెంది. ఇదివరకు శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్న సంగతి తెలిసిందే. అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారిగా అయ్యప్పను ఇద్దరు మహిళలు దర్శించుకున్నారు. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ ఇద్దరు మహిళలు బయటకు వచ్చి డ్యాన్స్ లు చేయడం విశేషం.

కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ తెల్లవారుజామున 3.45 గంటలకు అయ్యప్ప స్వామికి దర్శించుకుని ప్రార్థనలు చేసిన అనంతరం వెనుతిరిగారు. యూనిఫాం, సివిల్ డ్రస్సుల్లో ఉన్న పోలీసులు ఈ ఇద్దరూ మహిళలకు రక్షణగా నిలిచారు. గడిచిన డిసెంబర్ నెలలో సైతం ఆలయ ప్రవేశం చేయడానికి ఈ ఇద్దరు మహిళలు ప్రయత్నించగా తీవ్ర నిరసనల మధ్య వెనుతిరిగారు. కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకొని బయటకు వస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

అయితే మహిళలు ఆలయంలోకి అడుగుపెట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. కేరళ రాష్ట్రం కోయిలుండిలో అయ్యప్పను దర్శించుకున్న మహిళ బిందు ఇంటి వద్ద ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పోలీసులు ఆమె ఇంటి వద్ద మోహరించారు. భక్తులు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితిని ముందుగానే పసిగట్టిన బిందు భర్త హరిహరణ్ కుమార్తెతో కలిసి పరారయ్యారు. ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మహిళల ప్రవేశంతో ఆలయ అపవిత్రం అయ్యిందంటూ ఆలయాన్ని పూజారులు మూసివేశారు. సంప్రోక్షణ( ఆలయం శుద్ధి చేయడం) తర్వాత తిరిగి ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.