రాజ్యసభకు పోటీ చేయనున్న అమిత్ షా

SMTV Desk 2017-07-27 16:29:53  rajya sabha, delhi, parlament, amithsha, central minister smruthi

న్యూఢిల్లీ, జూలై 27 : ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నిక సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పోటీ చేస్తారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం వెల్లడించింది. ఐదుసార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన అమిత్‌షా రాజ్యసభలో అడుగు పెట్టడం బీజేపీకి ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక మరో స్థానానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని కూడా ఇదే రాష్ట్రం నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. గుజరాత్ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ కూడా తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శంకర్‌సింగ్ వాఘేలా నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తున్నది. కాగా, ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి ఏఎం దవే స్థానంలో మధ్యప్రదేశ్ నుంచి గిరిజన నేత సంపాతియా ఉయికే అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. గుజరాత్, బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 9 మంది సభ్యుల పదవీకాలం ఆగస్టు 18 తో ముగియనుంది.