3వేల మంది పర్యాటకులకు ప్రాణం పోసిన భారత్ సైన్యం

SMTV Desk 2018-12-29 17:58:53  Indian army, India-china boarder, Snow, Sikkim, Nathula

గ్యాంగ్‌టక్‌, డిసెంబర్ 29: భారత్- చైనా సరిహద్దుల్లో భారీగా మంచు కురవడంతో సిక్కింలోని నాథులా పాస్‌ వద్ద దాదాపు 3వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే వారికి ఎటువంటి ప్రాణహాని లేకుండా భారత్ సైన్యం రక్షించింది. పర్యాటకుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని వారిని సైనికులు సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, చలిని తట్టుకునే దుస్తులు అందించారని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నాథులా పాస్‌కు వెళ్లి తిరిగి వస్తున్న దాదాపు 300 నుంచి 400 వాహనాలు మంచులో చిక్కుకుపోయాయని తెలిపారు. అందులో నిలిచిపోయిన ప్రయాణికులను కూడా సురక్షితంగా తరలించారని చెప్పారు.