55 విదేశీ పర్యటనలుచేసిన మోడీ ...!!!

SMTV Desk 2018-12-29 13:14:02  Indian prime minister, Narendra modi, VK Singh, Overseas tour

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన ఖర్చును విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీ.కే. సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూన్ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అయిన ఖర్చు అక్షరాల రూ. 2,021 కోట్లు. చార్టెడ్ఫ్లెట్స్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెన్స్, హాట్ లైన్ సౌకర్యం వంటి తదితరాలకు ఈ మొత్తం ఖర్చు అయినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014లో 30,930.5 మిలియన్ల డాలర్లు కాగా అది 2017లో 43478.27 మిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని ఇప్పటి వరకు 55 దేశాలను సందర్శించారు.