పొట్టి దుస్తులతో రావద్దు... వడోదర పోలీస్ కమిషనర్ వార్నింగ్

SMTV Desk 2018-12-27 11:51:55  Vadodara Police, New year Prty

వడోదర, డిసెంబర్ 27: నూతన సంవత్సరం వేడుకలలో అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించవద్దని గుజరాత్ లోని వడోదర పోలీసులు హెచ్చరించారు. చిన్న చిన్న దుస్తులతో బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని హెచ్చరించారు. న్యూ ఇయర వేడుకల వేళ, ఏం చేయాలో, ఏం చేయరాదో చెబుతూ వొక నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ మేరకు వడోదర పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గలౌత్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.

మద్యం తాగి వేగంగా వాహనాలను నడిపించవద్దని, రౌడీల్లా ప్రవర్తించవద్దని, అనుచితంగా ప్రవర్తిస్తే కేసులు తప్పవని ఆయన తెలిపారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ, అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయన్నారు. అలాంటి వారిని అడ్డుకునేందుకు తాము నిర్విరామంగా విధులను నిర్వహిస్తామన్నారు. అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తామని, అందుకు వారు కూడా సహకరించాలని కోరారు. స్కిన్ షో చేయకూడదని వ్యాఖ్యానించిన ఆయన, దుస్తులు ఎలా ఉండాలన్న విషయమై మరింత వివరణను ఆ ప్రకటనలో పేర్కొనక పోవడం గమనార్హం. ఇదే సమయంలో పార్టీల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని, సీసీటీవీ కెమెరాలు తప్పనిసరని, రాత్రి 10 గంటల తరువాత బాణసంచా కాల్చరాదని ఆయన హెచ్చరించారు.