చిన్నారి ఉన్న ఒంటరి తండ్రికి వేతనంతో కూడిన సెలవు!

SMTV Desk 2018-12-26 13:41:46  NDA Government, Narendra Modi

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఏదైనా దుర్ఘటన జరిగి, తన బిడ్డను చూసుకునేందుకు భార్య లేకుంటే, ఆ పురుషుడికి వేతనంతో కూడిన సంవత్సరం సెలవు లభించనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బిడ్డ ఆలనాపాలనా చూసుకునే తండ్రికి తొలి 365 రోజుల పాటు పూర్తి వేతనంతో కూడిన సెలవు లభించనుంది.

ఇంకా కొన్ని దినాలు సెలవు కావాలని భావిస్తే, తదుపరి 730 రోజులకూ సగం వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. 7వ వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకూ ఈ సౌలభ్యం స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి పురుషులకు కూడా వర్తించనుంది.