ముంబై : మరో లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు

SMTV Desk 2018-12-25 12:00:22  Mumbai, Ladies hostel, Spy Cameras

ముంబై, డిసెంబర్ 25: హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటకలో లేడీస్ హాస్టల్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి యువతుల నగ్నదృశ్యాలను చిత్రీకరించిన ప్రబుద్ధుల బాగోతాన్ని మరువకముందే దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని అప్ మార్కెట్ సమీపంలోని ఓ హాస్టల్ లో పీజీ చదువుతున్న అమ్మాయిల వీడియోలను సేకరించి, ఇతరులకు పంపించాడో ప్రబుద్దుడు. నాలుగు రూములున్న ప్లాట్ ను హాస్టల్ మాదిరి మార్చి, ముగ్గురిని పేయింగ్ గెస్టులుగా చేర్చుకుని, వారి గదిలో అమర్చిన అడాప్టర్ లో సీక్రెట్ కెమెరాను ఉంచాడు.

అనంతరం వారి దృశ్యాలను తన మొబైల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ఓ అమ్మాయి అడాప్టర్ పై తన వస్త్రాన్ని కప్పగా, తనిఖీ పేరిట గదిలోకి వచ్చిన యజమాని, వస్త్రం ఎందుకు కప్పావని ప్రశ్నించడంతో అమ్మాయిలకు అనుమానం వచ్చి, పరిశీలించి చూడగ అందులో కెమెరా అమర్చినట్లు గుర్తించారు. ఆపై పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాదిన్నరగా అమ్మాయిల ఫుటేజ్ లను యజమాని సేకరించాడని తేల్చారు. అతనిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని అన్నారు.