చెన్నై, డిసెంబర్ 23: కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనికాంత్ నటిస్తున్న చిత్రం పెట్ట . రోబో 2.O తర్వాత భారీ స్థాయిలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. రజిని సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా తమిళ్ సెన్సార్ వర్క్స్ కూడా ఫినిష్ అవ్వడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మరింత పెంచాలని అనుకుంటోంది. ఇక సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. జనవరి 11న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్స్ అండ్ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యువ సంచలనం అనిరుధ్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే తెలుగులో ఇంకా పేట్ట హడావుడి కనిపించడం లేదు.