పాకిస్థాన్ ప్రధానిపై మండిపడ్డ భారత్..!

SMTV Desk 2018-12-21 16:49:19  Imran Khan, India, Kashmir, Pakistan, Raveesh Kumar, United nations

కాశ్మీర్, డిసెంబర్ 21: కాశ్మీర్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. కాశ్మీర్ లోని ప్రజలపై జరుగుతున్న దాడులపై చింతిస్తున్నానని, భవిష్యత్తు ఏంటో కశ్మీరీలు నిర్ణయించుకోవాలని.. కశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తుతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

(“Kashmiris must be allowed to decide their future”. He also tweeted that Pakistan would raise the issue of India s alleged human rights violations at the United Nations.)

విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పందిస్తూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ చాలా ఎక్కువగా స్పందిస్తోందని, వారి పని వారు సక్రమంగా చేసుకుంటే మంచిదని ఆయన మండిపడ్డారు. భారత్ గురించి కాకుండా వారి దేశంలోని ఉగ్రవాదులను నిర్మూలిస్తే మంచిదని చెప్పారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదులను నిర్మూలిస్తే.. కశ్మీర్ లో దాడులు జరగవని చెప్పారు. కాశ్మీర్ లోని ప్రజలపై జరుగుతున్న దాడులకు పాకిస్థాన్ ఉగ్రవాదులే కారణం అనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. వారి దేశంలో ఉన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా... పక్క దేశాలను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.