ఊహించని విధంగా షారుఖ్ 'జీరో' రివ్యూ & రేటింగ్

SMTV Desk 2018-12-21 12:30:57  Zero, Sharukh khan, Anushka sharma, Katrina kaif, Anand L ray, Gouri khan, Zero movie review

టైటిల్ : జీరో
నటీనటులు: షారుఖ్ ఖాన్, అనుష్క, కత్రినా తదితరులు
కథ, దర్శకత్వం: ఆనంద్ ఎల్. రాయ్
సంగీతం: అజయ్ గోగవాలే, అతుల్ గోగవాలే
ఎడిటింగ్: హేమల్ కొతారి
సినిమాటోగ్రఫీ: మను ఆనంద్
నిర్మాతలు: గౌరీ ఖాన్

రేటింగ్: 1/5

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఆయన కెరీర్ బాగా దెబ్బతింది. సక్సెస్ లు రాక ఈ స్టార్ హీరో బాగా ఇబ్బంది పడుతున్నాడు.

ఈ క్రమంలో జీరో అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో కనిపిస్తున్నాడని తెలియగానే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా అంతకుమించి ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని అంటున్నారు.

బాలీవుడ్ లో వొకరోజు ముందే సినిమా స్పెషల్ షోలు వేయడంతో టాక్ బయటకి వచ్చేసింది. నేషనల్ మీడియా ఈ సినిమాకి ఇస్తోన్న రేటింగ్స్ చూస్తుంటే సినిమా ఇంత దారుణంగా ఉందా అని అనిపించకమానదు. నిజానికి ట్విట్టర్ లో కొంతమంది సినిమా బాగుందంటే మరికొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు. కానీ ఎక్కువ శాతం ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోలేకపోయింది.

సాధారణంగా ఏ సినిమాకి పెద్దగా వంక పెట్టని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకి రేటింగ్ 1 ఇచ్చాడు. వీఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ సినిమా బోరింగ్ గా ఉందని అంటున్నారు. షారుఖ్, అనుష్క, కత్రినాల నటన.. డాన్స్ బాగున్నా కథ,కథనాలు ఆసక్తికరంగా లేకపోవడం సినిమా తేలిపోయిందని టాక్.