మాంచి ఊపుతెప్పిస్తున్న 'ఎఫ్ 2 ' పాట

SMTV Desk 2018-12-20 14:13:32  Rechhipodham Brother Video Song , F2 Video Songs,Venkatesh, Varun Tej, Anil Ravipudi,DSP

హైదరాబాద్, డిసెంబర్ 20 : యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేశ్ కథానాయకులుగా ఎఫ్ 2 సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది . ఇప్పటికే టీజర్ ని విడుదలచెయ్యగా మంచి స్పందన వచ్చింది . ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెచ్చిపోదాం బ్రదర్ అంటూ సాగే సాంగ్ ప్రోమో సాంగ్ ను వదిలారు. వెంకటేశ్ , వరుణ్ తేజ్ ,రాజేంద్ర ప్రసాద్ లపై ఈ సాంగ్ ను ఫన్నీ గా చిత్రీకరించారు.

దేవిశ్రీ ప్రసాద్ బాణీ యూత్ కి ఊపుని ఉత్సాహాన్ని ఇచ్చేలా వుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్అ లరించనున్నారు.