అన్నగారి ఆడియో కి అంతా సిద్ధం

SMTV Desk 2018-12-20 13:49:31  Ntr,krish,Nbk,Ntrbiopic,ntr kathanayakudu, ntr mahanayakudu,tollywood,mm kervaani

హైదరాబాద్, డిసెంబర్ 20 : విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రా పోస్తూ అన్న నందమూరి తారక రామారావు గారి జీవితం ఆధారం గా నిర్మితమవుతున్న చిత్రం " యన్ . టి . ఆర్ " . అన్న గారి విజయ పరంపర సినిమాల్లో , రాజకీయాల్లో కూడా సాగింది . అందువలన ఈ చిత్రాన్ని " కథానాయకుడు " " మహానాయకుడు" ఇలా రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్నారు .


ఇప్పటికే రెండు పాటలని విడుదలచెయ్యగా అద్భుతమయిన స్పందన వస్తుంది .

ఈ నేపథ్యంలో ఈ రెండు భాగాలకు సంబంధించిన పాటలను యన్ . టి . ఆర్ గారి స్వస్థలమయిన నిమ్మకూరులో రేపు భారీగా విడుదల చేయ్యాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ ఇందుకు వేదికగా మారుతోంది. ఈ వేడుక రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. కీరవాణి అందించిన ఆడియోతో పాటు, ట్రైలర్ ను కూడా ఇదే వేదికపై లాంచ్ చేయనున్నారు. రానా .. సుమంత్,నిత్యామీనన్,విద్యాబాలన్,రకుల్,హన్సిక,తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.