విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్న జీఎస్‌ఎల్వీ-ఎఫ్11

SMTV Desk 2018-12-19 20:05:46  Srihari kota, GSAT-7A, GSLV-F1 Rocket

చెన్నై, డిసెంబర్ 19: ఈ రోజు సాయంత్రం 4.10 గంటలకు శ్రీహరికోట నుంచి దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఏను జీఎస్‌ఎల్వీ-ఎఫ్11 రాకెట్ ద్వార నింగిలోకి పంపుతున్న విషయం తెలిసిందే. అయితే అనుకున్న విధంగానే నాలుగు గంటల పది నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగివైపు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 దూసుకుపోయింది.
రాకెట్‌ ద్వారా జీశాట్‌ -7 ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. జీశాట్‌- 7ఏ బరువు 2, 250 కిలోలు. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-11 ప్రయోగంతో దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఎయిర్‌ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ శాటిలైట్‌ను ఇస్రో తయారు చేసింది.
2013లో ప్రయోగించిన జీశాట్-7 కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్లపాటు సేవలు అందిస్తుంది. భూమి నుంచి రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం 19.2 నిమిషాల్లో తన మూడు దశలను పూర్తిచేసుకొని జీశాట్-7 ఏ ఉపగ్రహాం భూస్థిర కక్ష్యలోకి చేరుకుంది.