అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్ జెండర్స్

SMTV Desk 2018-12-18 18:50:26  Shabarimala temple, Transe genders, Visit the temple

కేరళ, డిసెంబర్ 18: శబరిమల ఆలయ వివాదంపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీరుపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి తెలిసిందే. శబరిమల ఆలయ వివాదంపై సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చినా, అక్కడి భక్తులు అడ్డుకోవడంతో మహిళలు వేనుకడుగేస్తున్నారు. అయితే ఇదిలా వుండగా డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన నలుగురు ట్రాన్స్ జెండర్స్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఫస్ట్ బేస్ క్యాంప్ ఎరుమలి సమీపంలోని పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆ నలుగురు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లు శబరిమల ఆలయ ప్రధాన పూజారితో చర్చలు జరిపిన తర్వాత వారికి అనుమతి లభించింది. దీంతో వాళ్లు అయ్యప్పను దర్శించుకున్ని మొక్కులు తీర్చుకున్నారు. నల్లచీరలు ధరించి, ఇరుముడితో సాంప్రదాయబద్ధంగా వచ్చిన నలుగురు ట్రాన్స్‌జెండర్లకు పోలీసులు భద్రత కల్పించారు. నీలక్కల్ నుంచి పంబ వరకు, ఆ తర్వాత కొండ ఎక్కుతున్న సమయంలో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. పవిత్రమైన 18 మెట్లను కూడా వాళ్లు ఎక్కారు. నలుగురు ట్రాన్స్‌జెండర్లను అనన్య, తృప్తి, రెంజుమోల్‌, అవంతికలుగా గుర్తించారు.