'నేను చాలా సంతోషంగా ఉన్నా' : నివేతా థామస్

SMTV Desk 2018-12-18 13:20:47   kalyan ram, nandamuri, nkr, tdp, tollywood,118 teaser,patas,nivetha thomas, shalini pandey

హైదరాబాద్, డిసెంబర్ 18 : నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నివేతా థామస్ , షాలిని పాండే హీరోయిన్లగా , ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో "118" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాత గా వ్యవహరిస్తున్నఈ చిత్రం ఫస్ట్ లుక్ని ఇప్పటికే విడుదల చెయ్యగా మంచి స్పందన వచ్చింది కాగా ఈ రోజు ఆ సినిమా టీజర్ ని విడుదల చేశారు . ఈ టీజర్ కి మంచి స్పందన వస్తుంది.


కాగా అందాల భామ నివేతా స్పందిస్తూ " అందరికీ నమస్కారం , 2019 కొత్త సంవత్సరంలో 118 సినిమాతో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది " అని టీజర్ ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యకతం చేసింది.