మధ్యప్రదేశ్ సీఎం గా కమల్ నాధ్ ప్రమాణ స్వీకారం.!

SMTV Desk 2018-12-17 18:44:38  Madyapradesh CM Oath Ceremony, Kamalnadh

మధ్యప్రదేశ్, డిసెంబర్ 17: మధ్యప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్‌లోని జాంబురి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కమల్ నాథ్ తో ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం,కమల్ నాథ్ రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేశారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరగనుంది. తాము అధికారంలోకొస్తే రుణమాఫీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నట్టయింది.

తాజాగా వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 114స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 116 స్థానాలు రావాలి, కానీ రెండు సీట్లు తక్కువగా వచ్చాయి. భాజపా 109, బీఎస్పీ 2, సమాజ్‌వాదీ పార్టీ వొక చోట, ఇతరులు 4చోట్ల గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌కు మాయావతి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సిద్ధరామయ్య, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, జమ్మకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, ఇతర కాంగ్రెస సీనియర్‌ నేతలు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకాలేదు.