2018 టాప్ 20 సినిమాల్లో టాలీవుడ్ దే పై చేయి

SMTV Desk 2018-12-17 18:37:47  2018 top 20 movie list, Robo 2.O, Sarkar, Rangasthalam, Bharath ane nenu, Kalaa, Aravinda sametha, Geetha govindam, Gang, Agnathavashi

ఫిలిం నగర్, డిసెంబర్ 17: 2018 సంవత్సరం టాప్ 20 సినిమా లిస్ట్ లో మన తెలుగు సినిమాలే ఎక్కువగా వుండడం విశేషం. సంవత్సరం చివరన రిలీజైనా వసూళ్ల పరంగా ఈ ఏడాది విడుదలైన అన్ని సౌత్ సినిమాలను దాటేసింది రజనీకాంత్ 2.0. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే అందుకుందని చెప్పక తప్పదు. మిగితా సినిమాల వసూళ్లు

*2.0 మూవీ
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 2.0 . రూ. 540 కోట్ల బడ్జెట్‌తో రూపొందింసాకగ. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 710 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు ఇంకా బాక్సాఫీసు వద్ద వసూల్లు సాధిస్తూ రన్ అవుతోంది.

*సర్కార్
విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సర్కార్ . రూ. 115 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 257 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ. 139 కోట్ల షేర్ వసూలు చేసింది.

*రంగస్థలం
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగస్థలం . రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 215.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 125.2 కోట్ల షేర్ వసూలు చేసింది.

*భరత్ అనే నేను
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను చిత్రాన్ని దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 210 కోట్ల గ్రాస్ వసూలు చేయగా అందులో రూ. 105 కోట్ల షేర్ వసూలైంది.

*కాలా
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కాలా . రూ. 135 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 168 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. రూ. 85 కోట్లకు మించి షేర్ వసూలు కాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

*అరవింద్ సమేత
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 90.7 కోట్ల షేర్ వసూలు చేసింది.

*గీత గోవిందం
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం గీత గోవిందం . కేవలం రూ. 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 126 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 70.1 కోట్ల షేర్ రావడం విశేషం. ఈ ఏడాది సౌత్‌లో అత్యధిక లాభాల శాతం సాధించిన చిత్రం ఇదే.

*గ్యాంగ్
సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గ్యాంగ్ . రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 48.4 కోట్ల షేర్ వసూలైంది.

*అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అజ్ఞాతవాసి . దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 93 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇందులో రూ. 57.5 కోట్లకు మించి షేర్ వసూలు కాక పోవడంతో భారీ నస్టాలు తప్పలేదు.