'వినయ విధేయ రామ' తస్సాదియ్య లిరికల్ వీడియో సాంగ్

SMTV Desk 2018-12-17 18:36:47  Ram Charan, Boyapati Seenu, Devi Sri Prasad, Vinaya Vidheya Rama, Kaira adhwani, tassadiyya lyrical song

హైదరాబాద్, డిసెంబర్ 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ . ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు, మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ పాటైన తస్సాదియ్యా లెట్స్ డు మామామియా అనే లిరికల్ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదివరకు విడుదలైన మొదటి పాటకు మంచి స్పందనే లభించింది.

ఈ సినిమా కోసం ఇటీవల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారట. ఇంటర్వెల్ కు ముందు ఈ సన్నివేశం ఉంటుందని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్ లో రామ్ చరణ్ తో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా బోయపాటి తనదైన శైలిలో చిత్రీకరించారట. ఈ సినిమాలో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కీలకమైనదని తెలుస్తోంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వినయ విధేయ రామ చిత్రం పేక్షకుల ముందుకు రానుంది.