విజయ్ కి తప్పిన ప్రమాదం

SMTV Desk 2018-12-17 18:29:46  Vijay devarakonda, Dear comrade, Shooting spot accident

కాకినాడ, డిసెంబర్ 17: ప్రముఖ యువ నటుడు విజయ దేవరకొండ ఈ మధ్యే టాక్సీవాలతో వచ్చి మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న తన తాజా చిత్రం డియర్ కామ్రెడ్ . ఈ సినిమా షూటింట్ కాకినాడలో జరుగుతోంది. ఈ క్రమంలో విజయ్ కి పెను ప్రమాదం తప్పింది. ఓ సెన్ లో విజయ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వేగంగా మెట్లు దిగివచ్చి కదులుతోన్న ట్రైన్ ఎక్కాలి. అలా పరిగెత్తుకొచ్చి ట్రైన్ ఎక్కబోయిన క్రమంలో విజయ్ పట్టుతప్పి క్రిందపడిపోయాడు. వెంటనే అక్కడి సిబ్బంది విజయ్ ని పక్కకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ ఎడమ చేయి, కుడికాలుకి దెబ్బలు తగిలాయి. షూటింగ్ అనంతరం హోటల్ కి చేరుకున్న విజయ్.. తగిలిన దెబ్బలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. దానికి లైఫ్ లో ఏదీ ఈజీగా రాదు అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో విజయ్ కి ప్రమాదంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.