పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం

SMTV Desk 2018-12-15 17:06:16  Parliament elections,

రాబోయే 2019 పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది . ఎన్నికల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం . ఏప్రిల్ 6వ తేదీన మొదటి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, వొడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఏపీలో ఏ విడతలో ఎన్నికలు జరుగుతాయో స్పష్టత రావాల్సి ఉంది. 2014లో ఏపీలో మే 7న ఎన్నికలు జరిగగా, మే 16న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 7న తొలి దశ ఎన్నికలు జరిగాయి. మే 12 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యాయి మే 16న కౌంటింగ్ జరిగింది. మే 26న నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందే షెడ్యూల్ విడుదలైతే, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ తాయిలాలు ప్రకటించడానికి వీలు ఉండదు