వైస్సార్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

SMTV Desk 2018-12-15 15:45:14  yathra,ysr,mammuty,ysrcp,congress

హైదరాబాద్ , డిసెంబర్ 15 : వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితచరిత్రను యాత్ర పేరుతో మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు మహి వి.రాఘవ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన 3 భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని , తెలియజేస్తూ వొక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అప్పట్లో జననేత చేసిన పాదయాత్ర ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పి ఆయన విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. అందుకే ఈ సినిమాకి యాత్ర అనే పేరు పెట్టుంటారు , ఆ విశేషాలన్నీ కూడా ఈ బయోపిక్ లో చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజల్లో వైఎస్ఆర్ పట్లగల ఆదరాభిమానాల కారణంగా, ఈ సినిమాకి విశేషమైన స్పందన లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.