మూడోసారి సభ్యత్వం కావాలంటున్న ఏచూరి

SMTV Desk 2017-07-26 13:05:53  seetharam achuri, cpm , prakash karath, rajyasabha, leaders

న్యూఢిల్లీ, జూలై 26 : రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికైన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పదవి కాలం ఆగస్టు 28 తో ముగియనుంది. మూడోసారి కూడా రాజ్యసభ సభ్యత్వం అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ప్రణాళికలు వేశారు. దీనిపై రాజ్యసభ మరో నేత ప్రకాష్ కారత్ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభంకానున్నాయి. కాగా, ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కు తుదిగడువు ఈ నెల 28 తో ముగియనుంది. ఈ మేరకు రాజ్యసభ సభ్యత్వంలో ఎవరు పోటీ చేస్తారనే దానిపై సెంట్రల్ కమిటీ స్పష్టతనివ్వనుంది. పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులకు రెండుసార్లే అవకాశం ఇవ్వాలన్న నిబంధనను కారత్‌ వర్గం గుర్తుచేస్తోంది. అయితే గతంలోనే ఈ నిబంధనకు మినహాయింపు ఇచ్చారని ఏచూరిని ఏకగ్రీవంగా ఎన్నుకోని పక్షంలో వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్‌ బ్లాక్‌ వంటి పలు పార్టీలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకునే అవకాశముందని ఏచూరి వర్గమంటోంది.