యువరాజ్ సింగ్ చేసిన ప్రతిజ్ఞ

SMTV Desk 2018-12-12 12:25:51  yuvarajsingh ,yuvi,icci,cricket,india,youwecan

ఢిల్లీ,డిసెంబర్ 12 : ఈ రోజు సిక్సర్ల వీరుడు భారత్ క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్ జన్మదినం. 2011 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్లో యువరాజ్ వొక సెంచరీ మరియు నాలుగు అర్ధ సెంచరీలతో సహా 362 పరుగులు చేశాడు, 15 వికెట్లు పడగొట్టాడు, నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ అవార్డులు గెలుచుకున్నాడు మరియు "మాన్ అఫ్ ది టోర్నమెంట్" కూడా పొందాడు. ఈ ప్రక్రియలో, అతను ప్రపంచ కప్లో 300పైగా పరుగులను సాధించి 15 వికెట్లు తీసిన ఏకైక ఆల్ రౌండర్. ఇంగ్లండ్ డర్బన్లో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్పై ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించి కేవలం 12 బంతులలోనే 50 కొట్టిన మొదటి ఆటగాడు.

2011 లో కాన్సర్ బారిన పడి 2012 లో దానిని అధిగమించి మళ్ళీ మైదానం లో మెరుపులు మెరిపించాడు. తన గుండె ధైర్యాన్ని ఎందరో పొగిడారు . అయితే ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భం గా ట్విట్టర్ ద్వారా వొక ప్రతిజ్ఞ చేసాడు.


అదేంటంటే తనకి ధైర్యాన్ని , బలాన్ని ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ , ఇప్పుడున్న పరిస్థితులలో చాల మంది కాన్సర్ రోగ పీడితులు డబ్బు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితిలో లేరని , తన పుట్టిన రోజున "యు వి కెన్ ఫౌండేషన్" ట్రస్ట్ ద్వారా 25 మంది కాన్సర్ భారిన పడిన పేద పిల్లలకు ట్రీట్మెంట్ చేయిస్తానని . సహాయం చేయాలనుకునే వారు , మరింత తెలుసుకోవాలనుకునే వారు ఈ లింక్ ని ఫాలో అవ్వండి అంటూ తన ఫౌండేషన్ లింక్ని పోస్ట్ కి జత చేసాడు. నిజంగా యువి తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి వ్యక్తికి స్ఫూర్తి దాయకం. ఇవ్వడంతోనే సంతృప్తి ఉంటది అనే సూత్రాన్ని బాగా ఫాలో అవ్వుతున్న మన యువీ కీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దాం.