అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం : ఖుష్బూ

SMTV Desk 2018-12-10 18:29:01  kushbu,ntr, amitabachan,kamal hasan

హైదరాబాద్, డిసెంబర్ 10 : పాత తరం అగ్ర కథానాయక ఖుష్బూ ఇటీవల జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే ఇంటర్వ్యూ తన గురించి, తన అనుభవాల్ని ,ఇష్టాల్ని పంచుకుంది.

ఆమెకు బాలీవుడ్ లో అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టమని ఆయన ఏడ్చిన సీన్స్ చూస్తే తెలియకుండానే ఏడ్చేస్తానని చెప్పింది . తెలుగు హీరోల్లో తారక్ అంటే చాలా ఇష్టం , చిన్నపిల్లలాగా ఈలలు వేస్తూ సినిమా చూడాలనుందని , తారక్ ఆటోగ్రాఫ్ కూడా ఆమె దగ్గర ఉందని చెప్పింది . తమిళంలో కమలహాసన్,కార్తీ అంటే అభిమానం ఉందని చెప్పుకొచ్చారు .