సారి చెప్పిన నాగబాబు

SMTV Desk 2018-12-10 16:00:06  nagababu about balakrishna

హైదరాబాద్, డిసెంబర్ 10 :
నాగబాబు వొక తరం జనానికి చిరంజీవి తమ్ముడిగా , ఈ తరానికి "జబర్దస్త్ కామెడీ షో కి జడ్జి" గా పరిచయం ఉంది . అయితే ఇటీవల జరిగిన వొక ఇంటర్వూలో రామ్ గోపాల్ వర్మ , బాలకృష్ణ గురించి అభిప్రాయం చెప్పమంటే మొదటిగా రామ్ గోపాల్ వర్మ మీద ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పారు తరువాత బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని అన్నాడు, అప్పుడు యాంకర్ నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదా ? అని అడుగగా ,వెంటనే తేరుకుని వల్లూరి బాలకృష్ణ గొప్ప హాస్య నటుడు ఆయనని మర్చిపోయనేంటి అని అతి తెలివిగా సమాధానం ఇచ్చారు . దాంతో సామజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేగింది .

అయితే నాగబాబు తాజా గా మీడియా ముందుకు వచ్చి " తన వ్యాఖ్యలతో కొంత మంది ఫీల్ అయ్యారని అలా అనడం తప్పుకదా, మీకు తెలియదా? అని అడిగారని తెలిపారు. బాలకృష్ణ ఎవరో తెలియదు అని అనడం నిజంగానే నా మిస్టేక్ అని చెప్పారు. బాలకృష్ణ తెలియని వారు ఎవరుంటారని అన్నారు. ఆయన అందరికీ తెలుసని చెప్పారు. ఆయన మంచి నటుడని, పెద్ద కమెడియన్ అని, హాస్యాన్ని అద్భుతంగా పండించగల అతి కొద్ది మంది నటుల్లో ఆయన వొకరని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఫొటోను చూపించారు. ఈయనకు అంజిగాడు అనే నిక్ నేమ్ కూడా ఉందని చెప్పారు. ఆయన మరణించి చాలా కాలమయిందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణలతో కలసి కూడా పని చేశారని చెప్పారు. ఇదంతా నాగబాబు ఉద్దేశ్య పూర్వకంగా చేస్తునట్లుగా అర్థంచేసుకోవచ్చు . జీవితం లో ఎన్నో వొడిదుడుకులు, ఆత్మహత్యా యత్నానికి కుడా దారిసినటువంటి పరిస్థులని ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి , తన తోటి నటుడు, అగ్ర హీరో తెలియదగు,అనేంత పొగరు ప్రదర్శించి ఇలాంటి చౌక బారు వివాదం లో ఉండడం ఆలోచించ దగిన విషయం .

ఇండస్ట్రీ లో ముల్టీస్టారర్ సినిమాలు వస్తున్న ఈ శుభపరిణామం లో విభేదాలు సృష్టించే ఇలాంటి వ్యాక్యలు చేయడం నాగబాబు మానసిక స్థితికి అద్దం పడుతుంది .