రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్‌, రాజమౌళి

SMTV Desk 2018-12-09 11:40:40  Ram charan, Rajamouli, NTR

హైదరాబాద్, డిసెంబర్ 09: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. ఈ నెలాఖరు వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11 న సినిమా విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. రామ్ చరణ్ కు జోడిగా ఈ సినిమాలో కైరా అద్వానీ నటిస్తున్నది. బోయపాటి దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటె, ఈ సినిమాతో పాటు రామ్ చరణ్… ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. డివివి దానయ్య వినయ విధేయ రామ తో పాటు ఇటు ఆర్ఆర్ఆర్ సినిమానునిర్మిస్తున్నాడు. త్వరలోనే వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ లు కూడా పాల్గొంటారని సమాచారం. రామ్ చరణ్ తో ఎన్టీఆర్, రాజమౌళి కూడా పాల్గొంటే సినిమాకు క్రేజ్ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.