2.ఓ డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు

SMTV Desk 2018-12-09 10:29:31  Rajinikanth, 2.o movie, Shanker, Telugu Tamil Distributers

హైదరాబాద్, డిసెంబర్ 09: డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజిని కలిసి చేసిన క్రేజీ మూవీ 2.ఓ భారీ బడ్జెట్ మూవీతో భారీ అంచనాల మధ్య వచ్చింది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా వారంలో 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని ఎనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 6800 థియేటర్స్ లో రిలీజైన 2.ఓ అన్ని చోట్లు ఎలా ఉన్నా హింది వర్షన్ లో మాత్రం మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుందని అంటున్నారు. ఇప్పటివరకు 125 కోట్ల కలక్షన్స్ తో 2.ఓ హిందిలో సూపర్ హిట్ అయ్యింది.

అయితే తెలుగు, తమిళ భాషల్లో మాత్రం 2.ఓ డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలే తెచ్చేలా ఉన్నాయి. తెలుగులో 72 కోట్లకు కొనగా ఇప్పటివరకు 40 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక తమిళంలో కూడా సినిమా మీద ఉన్న అంచనాలకు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఇప్పటివరకు అక్కడ 40 కోట్లు మాత్రమే రాబట్టిందట. ఎలా లేదన్నా తెలుగు, తమిళ భాషల్లో 2.ఓ డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు తప్పేలాలేవు.