చైనాకు వెళ్తున్న చెన్నై చిట్టి..!

SMTV Desk 2018-12-05 17:43:01  Rajanikanth, Sankar, Akshay Kumar, Amijaksan, 2.O

చెన్నై: ‘చిట్టి ది రోబోర్ట్ అని 8 సంవత్సరాల ముందు రోబో సినిమాతో మనందరిని అలరించిన సూపర్ స్టార్ రజనీకాంత్, దాని సీక్వెల్ 2.ఓ తో వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాలోనూ 2.ఓ సందడి చేయబోతున్నాడు. దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. చైనాకు చెంది ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్‌వై మీడియాతో కలిసి ‘2.ఓ ను ఆ దేశంలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. మే నెలలో ‘2.ఓ సినిమా డబ్‌, సబ్‌ టైటిల్‌ వెర్షన్‌ను చైనాలో 10 వేల థియేటర్లలోని 56 వేల స్క్రీన్లపై (47వేల+ 3డీ స్కీన్లు) విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. దీంతో ఈ చిత్రం చైనాలో కూడా చరిత్ర సృష్టించబోతోందని విశ్లేషకులు అంటున్నారు.


ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించిన ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, కథానాయికగా అమీ జాక్సన్ నటించారు. నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఇలాగే కొనసాగితే బాహుబలి2 రికార్డులు అధిగమించడం ఖాయం అని సినీవిశ్లేషకుల అంచనా.