బాక్సాఫీస్ వద్ద దూసుకపోతున్న రోబో 2.ఓ

SMTV Desk 2018-12-02 18:36:55  robo 2.o, rajinikanth, akshay kumar, 2.o collections, shanker

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 2.0భారీ అంచనాల మధ్య గరువారం విడుదలైంది. ముందుగా ఊహించినట్లుగానే ఈచిత్రం తొలిరోజు భారీగా వసూళ్లు చేసింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈచిత్రం తొలిరోజు రూ.19 కోట్లు వసూలు చేసినట్లు సీని విశ్లేషకులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలుగులో ఇప్పటివరకు విడుదలైన రజనీ సినిమాల్లో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇక తమిళనాడులోని చెన్నై నగరంలో రూ.2.64 కోట్లు రాబట్టింది. . కర్ణాటకలో ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.8.25 కోట్లు. ఇక ఓవర్‌సీస్‌ విషయానికొస్తే.. అమెరికాలో 2.ఓ చిత్రం 265 ప్రదేశాల్లో విడుదలైంది. తొలిరోజు రాత్రి పది గంటల వరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్లు 295000 డాలర్లు(రూ.2,05,54,125). న్యూజిలాండ్‌లో 18 ప్రదేశాల్లో విడుదలైన ఈ చిత్రం 23,243 న్యూజిలాండ్‌ డాలర్లు (రూ.11.11 లక్షలు) రాబట్టింది. ఆస్ట్రేలియాలో 114,696 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.58.46 లక్షలు) రాబట్టింది. అక్కడ ఈ చిత్రం 35 ప్రదేశాల్లో విడుదలైంది.