రోబో 2.O ఖాతా లో మరొక పెద్ద రికార్డు

SMTV Desk 2018-11-29 13:44:45  SARKAR,ROBO2.O,RAJAINI,AKSHAYKUMAR,

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ,అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా తెరకెక్కిన చిత్రం "2.O " ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల విషయంలోనే ఈ సినిమా కొత్త రికార్డులను నమోదుచేస్తుందని మనం వింటున్నాం . ఇప్పటి వరకు కేరళలో అత్యధిక థియేటర్లలో విడుదలైన పరభాషా చిత్రంగా ఇన్నాళ్లూ సర్కార్ పేరు మీద రికార్డు వుంది. కానీ దాన్ని కూడా "2.O " అధిగమించింది .

సర్కార్ 412 స్క్రీన్లలో విడుదలై ఈ మద్యే నే ఈ రికార్డు ను నమోదుచేసింది . కానీ , " 2.O " ఆ రికార్డును 458 స్క్రీన్లలో విడుదలైన అతి కొద్దీ కాలం లోనే చెరిపి కేరళలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 3డీ ఎఫెక్ట్స్ , 4డీ సౌండింగ్ సినిమా కావడంతో, కేరళ వాళ్లు ఈ సినిమా చూడటానికి విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారట. ఇంతవరకూ శంకర్ చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందనీ, ఓపెనింగ్స్ విషయంలోను సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి