మెగా మూవీ రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్

SMTV Desk 2018-11-26 17:32:13  Priya Prakash warrior , Mega hero,kalyan dev

హైదరాబాద్ , నవంబర్ 26:మళయాళ భామ ప్రియా ప్రకాశ్ వరియర్ గురించి అందరి తెలిసిందే. వొరు ఆదార్ లవ్ టీజర్ తో దేశం మొత్తాన్ని తన కను సైగలతో మెప్పించిన ప్రియా ప్రకాశ్ సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఆ టీజర్ తో వచ్చిన క్రేజ్ తో ఆమె ఇన్ స్టాగ్రాంలో 6 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పరచుకుంది. తెలుగులో వొకటి రెండు అవకాశాలు వచ్చినా కాదనేసిన ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ గా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మూవీని రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది.

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత అంతగా మెప్పించలేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో కళ్యాణ్ దేవ్ తన రెండో ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా పులి వాసు డైరెక్ట్ చేస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబడుతుంది. ఈ మూవీలో ప్రియాను తీసుకోవాలని ప్రయత్నించారట కాని ఆమె మాత్రం అందుకు నో అని చెప్పిందట.

తెలుగులో స్టార్ హీరోలతోనే నటించాలని ఉందని చెబుతుంది ప్రియా ప్రకాశ్. అంతేకాదు కోటి ఇస్తేనే కాని తాను తెలుగులో నటించనని చెబుతుందట. మరి స్టార్ అవకాశం రావడమే ఎక్కువ అనుకుంటే ఈ రేంజ్ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తే అమ్మడు తెలుగు అవకాశాలు మర్చిపోతే బెటర్.