‘మీటూ’ పై స్పందించిన హాట్ బ్యూటీ

SMTV Desk 2018-11-25 16:31:29  Poorna, Meetoo, Avunu Fame poorna

హైదరాబాద్ , నవంబర్ 25: ‘మీటూ ఉద్యమం మీద ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది నటీనటులు ఈ ఉద్యమాన్ని సపోర్ట్‌ చేస్తున్నారు. కొందరేమో కొట్టిపారేస్తున్నారు. ‘అవును ఫేమ్‌ పూర్ణ మాత్రం ‘మీటూ అంటే సెల్ఫ్‌ షేమింగ్‌ అంటున్నారు. ఈ విషయం గురించి పూర్ణ మాట్లాడుతూ ‘ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. బయటకు చెప్పాలి. నెల తర్వాత చెప్పినా కూడా అది నిరుపయోగమే. ప్రస్తుతం వస్తున్న కాంట్రవర్సీలు, రిపోర్ట్‌లు చూసి నా మేల్‌ ఫ్రెండ్స్‌ నాతో మాట్లాడటానికి సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు కూడా. ఈ ఉద్యమం కేవలం సెల్ఫ్‌ షేమింగ్‌ (స్వయం అవమానం) అనిపిస్తోంది నాకు. మనల్ని మనమే అవమానించుకున్నట్టుగా ఉంది అని పూర్ణ పేర్కొన్నారు.