కన్నడ స్టార్ హీరో అంబరీష్ ఇకలేరు

SMTV Desk 2018-11-25 11:46:40  Kannada Star Hero, rebal star, ambarish

చెన్నై, నవంబర్ 25: కన్నడ స్టార్ హీరో, పొలిటిషియన్ అంబరీష్ (66) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన బెనగళూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులతో చాలాకాలంగా ఆయన ఇబ్బంది పడ్డారట. 1952 మే 29న హుచ్చే గౌడా, పద్మావతిరావు దంపతులకు అంబరీష్ జన్మించారు.

ఆయన అసలు పేరు హుచ్చే గౌడా అమర్ నాథ్. తన అభిమానులు అంబీ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1972లో అంబరీష్ నాగరాహవు సినిమాతో తెరంగేట్రం చేశారు. కన్నడ పరిశ్రమలో ఆయన రెబల్ స్టార్ అంటారు. సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా అంబరీష్ తన ముద్ర వేసుకున్నారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన గృహ నిర్మాణ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు.

అంబరీష్ 1992లో ప్రముఖ నటి సుంలతను పెళ్లాడారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. అంబరీష్ మాత్రం ఎక్కువగా కన్నడ సినిమాలే చేశారు. దాదాపు 200 సినిమాలకు పైగా చేసిన అంబరీష్ మరణం కన్నడ సిని పరిశ్రమను శోక సముద్రంలో ముంచెత్తుతుంది. ఆయన మృతి పట్ల సౌత్ సిని ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.