హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్-2

SMTV Desk 2018-11-24 18:24:28  Bharateeyudu, Indian 2, kamal hasan, shanker, Hollywood

హైదరాబాద్, నవంబర్ 24: శంకర్ డైరక్షన్ లో కమల్ హీరోగా భారతీయుడు సినిమా సీక్వల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సీక్వల్ పనులు మొదలు పెట్టాడు శంకర్. దశాబ్ధ కాలం కావొస్తున్నా సరే ఇండియన్ పార్ట్ 2 అనగానే ఆ అంచనాలు వేరేలా ఉన్నాయి. అప్పట్లో సంచలన విజయం అందుకున్న భారతీయుడు సీక్వల్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఆలోచిస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను దించుతున్నాడట శంకర్. ఆల్రెడీ రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ కోసం హాలీవుడ్ నుండి విఎఫ్ఎక్స్ టీం ను తీసుకున్న శంకర్ ఇప్పుడు కమల్ ఇండియన్-2 కోసం కూడా హాలీవుడ్ నుండి సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోనున్నాడట. ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో కమల్ లుక్ కోసం వారి హెల్ప్ తీసుకుంటున్నాడట. చూస్తుంటే శంకర్ మరో సంచలనానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.