24 కిస్సెస్ రివ్యూ

SMTV Desk 2018-11-23 17:49:45  24 kisses, 24 kisses review,

హైదరాబాద్, నవంబర్ 23: ఆదిత్ అరుణ్, హెబ్భా పటేల్ జంటగా అవార్డ్ విన్నర్ డైరక్టర్ అయోధ్యా కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 24 కిస్సెస్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చైల్డ్ ఫిల్మ్ మేకర్ అయిన ఆనంద్ (ఆనంద్) పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్న పిల్లల కోసం ఏదైనా చేసేందుకు ఫిల్మ్ రెడీ చేస్తుంటాడు. అందుకు క్రొడ్ ఫండింగ్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో మాస్ కమ్యునికేషన్ చేసిన శ్రీలక్ష్మి (హెబ్భా పటేల్) ఆనంద్ తో జాయిన్ అవుతుంది. పరిచయం అయిన కొద్దిరోజులకే ఆనంద్ ప్రేమలో పడుతుంది. ఇద్దరు ప్రేమలో అ..ఆ..ఇ..ఈ దాటేస్తారు. ఇక తనతో పెళ్లి అన్నప్పుడల్లా మాటదాటేసే ఆనంద్ కు మరో అమ్మాయితో రిలేషన్ ఉందని గమనించిన శ్రీలక్ష్మి అతన్ని దూరం చేసుకుంటుంది. శ్రీలక్ష్మి దూరమయ్యాక ఆమె విలువ తెలుసుకున్న ఆనంద్ ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అన్నది ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే :

మిణుగురులు సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న అయోధ్యా కుమార్ 24 కిస్సెస్ అంటూ సినిమా తీయడం అందరిని ఆశ్చర్యపరచింది. అయితే సినిమా కథ, కథనాలు ఏవి ఆకట్టుకునేలా లేవు. అవార్డ్ విన్నర్ డైరక్టర్ సినిమా అంటే నమ్మేలా ఈ సినిమా ఉండదు. సినిమా అంతా అతుకులబొంతలా అనిపిస్తుంది.

ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలు ప్రేక్షకులకు వొకానొక దశలో విసుగు తెప్పిస్తాయి. మొదటి భాగం లీడ్ పెయిర్ ముద్దుల హంగామాతో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ సాగదీసి బోర్ కొట్టించేశాడు. హీరోయిన్ తో శారీరిక సంబంధం పెట్టుకుంటూనే పిల్లల గురించి ఆలోచించడం ఏంటో అర్ధం కాదు.

హీరో, హీరోయిన్ ఇద్దరు క్యారక్టర్స్ ను డైరక్టర్ సరిగా డీల్ చేయలేదు. కనీసం లీడ్ పెయిర్ రొమాన్స్ అయినా బాగుందా అంటే అది అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. మొత్తానికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన 24 కిస్సెస్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి తలనొప్పి సినిమాగా మారింది.

ఎలా చేశారు :

ఆదిత్ అరుణ్ తన పాత్ర వరకు బాగానే చేశాడు. శ్రీలక్ష్మి పాత్రలో హెబ్భా పటేల్ కూడా అలరించింది. అయితే దర్శకుడు ఈ ఇద్దరి పాత్రలను రాసుకున్న తీరు ఆకట్టుకోలేదు. కన్ ఫ్యూజ్ గా క్యారక్టర్స్ డిజైన్ చేశాడు. ఇక రావు రమేష్, సీనియర్ నరేష్ ల పాత్రలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాస్టింగ్ ను సరిగా వాడుకోలేదని చెప్పాలి.

జాయ్ బరువా మ్యూజిక్ ఆకట్టుకుంది. వొక పాట బాగుంది. బిజిఎం ఓకే. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. కథ, కథనాలు దర్శకుడు ఏమాత్రం ప్రతిభ కనబరచలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

రొమాన్స్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

స్క్రీన్ ప్లే

ప్రొడక్షన్ వాల్యూస్

బాటం లైన్ : 24 కిస్సెస్.. అవైడ్ చేస్తే బెటర్..!

రేటింగ్ : 1/5