కొడుకు పేరు ట్వీట్ చేసిన సానియా మీర్జా దంపతులు

SMTV Desk 2018-11-22 19:53:52  sania mirza, twitter

న్యూ ఢిల్లీ, నవంబర్ 22: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్‌మాలిక్ దంపతులకు ఇటీవల కొడుకు పుట్టిన విషయం విదితమే . ఆ చిన్నారికి నామకరణం కూడా చేశారు. తన చిన్నారి కొడుకును ఎత్తుకున్న ఫోటోను సానియా ట్విటర్, ఇన్‌స్టాగ్రాంలలో పోస్ట్ చేశారు. సానియా షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి పెళ్లైన ఎనిమిదేళ్లకు పుట్టిన మగబిడ్డకు సానియా, సోయబ్ దంపతులు ఇజాన్ మీర్జా మాలిక్‌గా నామకరణం చేశారు. ‘చిన్నారితో మధుర క్షణాలు అని క్యాప్షన్ ఇచ్చి చిన్నారితో తీయించుకున్న ఫోటోను సానియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.