'కె.జి.ఎఫ్' కు చీఫ్ గెస్ట్ గా దర్శకధీరుడు

SMTV Desk 2018-11-22 15:26:30  KGF, ss rajamouli, movie release cheif guest

హైదరాబాద్, నవంబర్ 22: తెలుగు, తమిళ, హింది భాషల్లో గ్రాండ్ గా డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్న సినిమా కె.జి.ఎఫ్ . కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా వస్తున్నఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే అన్ని భాషల్లో రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతాడని తెలుస్తుంది. సాయి కొర్రపాటి కొన్నాడు కాబట్టి రాజమౌళి అతని కోసమైనా వస్తాడు. అయితే జక్కన్న రాక కె.జి.ఎఫ్ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. బాహుబలి రేంజ్ లో భారీ స్థాయిలో తీసిన కె.జి.ఎఫ్ కి బాహుబలి మేకర్ రాజమౌళి సపోర్ట్ కచ్చితంగా సినిమాకు మంచి ఫలితాన్ని తెస్తుందని చెప్పొచ్చు.