అభిమానులకు హామీ ఇచ్చిన రామ్

SMTV Desk 2018-11-18 15:28:32  Ram pothineni, Hello guru premakosame

హైదరాబాద్, నవంబర్ 18: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఈ దసర స్సందర్భంగా వొచ్చి అనుకున్నంత కాకపోయినా మంచి విజయాన్నే అందుకుంది. దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సినిమా 17.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవగా ఫైనల్ కలక్షన్స్ గా 20 కోట్లు తెచ్చుకుంది.ఈ సినిమా ఫైనల్ కలక్షన్స్ ఉద్దేశిస్తూ రామ్ తన ఫ్యాన్స్ కు ఓ ట్వీట్ చేశాడు. హలో గురు ప్రేమకోసమే సినిమాతో అంతగా సాటిస్ఫై చేయకున్నా సినిమాను హిట్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పాడు రామ్. ఇక ఈసారి వడ్డితో కలిపి తిరిగి ఇచ్చేస్తా అంటూ ఫ్యాన్స్ కు ఉత్సాహపరిచే కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న రామ్ పూరి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.