విరసం నేత వరవరరావు అరెస్ట్

SMTV Desk 2018-11-18 15:22:33  Varavara rao, Arrested in pune, Transit warrent

పూణే, నవంబర్ 18: శనివారం రాత్రి పూణేలో విరసం నేత వరవరరావుని పోలీసులు తన నివాసంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాన్సిట్ వారెంట్ తో వచ్చి వరవర రావుని అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..

రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పూణేకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన నివాసం వద్ద బారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.