రాజమౌళి కీలక నిర్ణయం

SMTV Desk 2018-11-18 15:13:46  Rajamouli, RRR, ram charan, NTR, RRR Title

రాజమౌళి, ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకోగా ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. అల్యుమినియం ఫ్యాక్టరీలోనే చిత్రయూనిట్ అందరు ఉండేలా ఓ భారీ సెట్ వేయించాడట రాజమౌళి. ఇక కొన్నాళ్లుగా ఆర్.ఆర్.ఆర్ అంటే రామ రావణ రాజ్యం అని టైటిల్ పై రకరకాల వార్తలు వచ్చాయి.

అయితే రామ రావణ రాజ్యం అసలు టైటిల్ కాదని తెలుస్తుంది. చిత్రయూనిట్ క్లోజ్ సర్కిల్స్ నుండి అందిన సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ కు వేరే టైటిల్ ఆలోచిస్తున్నాడట రాజమౌళి. సినిమా టైటిల్ అన్ని భాషలకు వొకే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి సినిమాలానే ఆర్.ఆర్.ఆర్ కు అదిరిపోయే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. మరి ఆ టైటిల్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.