'వినయ విధేయ రామ' టీజర్ విడుదల

SMTV Desk 2018-11-09 11:48:25  Ram Charan, Boyapati Seenu, Devi Sri Prasad, Vinaya Vidheya Rama, Movie Teaser

హైదరాబాద్, నవంబర్ 09: రామ్ చరణ్, బోయపాటి శీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వినయ విదేయ రామ . ఈ చిత్రానికి చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి ముందు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ చిత్ర టీజర్ కొన్ని నిమిషాల క్రితం విడుదలైయింది. టీజర్ విషయానికొస్తేకొట్టాలా చంపాలా అని రామ్ చరణ్ బ్యాక్ గ్రౌండ్ లో అడగటం, నలుగురు అన్నయ్యలతో కలిసి స్టైలిష్ గా నడుచుకుంటూ రావడం, విలన్ గా వివేక్ వొబెరాయ్ ఎంట్రీ అంతగా సరైనోడు తరహాలో వొక ఫార్ములా ప్రకారం సాగింది. విలన్ ని ఛాలెంజ్ చేస్తూ నేను కొణిదెల రామ్ ని అంటూ చరణ్ చెప్పే డైలాగ్ పేలింది కాని గతంలో బద్రిలో పవన్ కళ్యాణ్ నువ్వు నందా అయితే నేను బద్రినాథ్ అంటూ ఆవేశంగా చెప్పే సీన్ గుర్తుకు వస్తుంది.
టీజర్ మొత్తాన్ని యాక్షన్ విజువల్స్ తో నింపేసారు. హీరొయిన్ కీయరా అద్వానీని కాని చరణ్ ఫ్యామిలీలోని ఇతర లేడీ బ్యాచ్ ని కాని ఎవరిని చూపించలేదు. మొత్తానికి రిస్క్ లేకుండా సంక్రాంతి బరిలో ఫుల్ మాస్ మసాలా మీల్స్ తో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ ని పలకరించబోతున్నాడు.