శబరిమల ఆలయ వివాదంపై స్పందించిన ప్రముఖ నటుడు

SMTV Desk 2018-10-31 15:02:38  Manchu manoj kumar, Shabarimala temple issue, Ram charan,

హైదరాబాద్, అక్టోబర్ 31: ప్రముఖ నటుడు మంచు మనోజ్ శబరిమల ఆలయ వివాదం పై తాజాగా స్పందించాడు. .ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఓ అభిమాని సేవ్‌ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్‌‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.దీనిపై మనోజ్ సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేస్తూ ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడంపై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్‌. మనోజ్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ అంశంపై నెటిజన్ మనోజ్‌తో రామ్ చరణ్‌ను కూడా ట్యాగ్ చేశాడు. మరి రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.