మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన జర్నలిస్ట్ ఆఖరి మాటాలు

SMTV Desk 2018-10-31 14:49:01  Chattisghar, Journalist, Maoist firings, Police, Viral video

ఛత్తీస్‌గఢ్‌, అక్టోబర్ 31: పోలీసుల వెంట ఎన్నికల కవరేజీ కోసం అడవుల్లోకి వెళ్లిన ఓ జర్నలిస్టు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో ఈ దారుణం జరిగిన కొంత సమయం క్రితం జర్నలిస్ట్ అచ్యుతానంద సాహు సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో అచ్యుతానంద సాహు మాటలు… ‘మేము ఎలక్షన్ కవరేజ్ కోసం దంతెవాడకు వచ్చాం. వొక దారి గుండా వెళ్తున్నాం. పోలీసులు మా వెంట వున్నారు. ఇంతలో మావోయిస్టులు మమ్మల్ని చుట్టుముట్టారు. అమ్మా.. నేనొకవేళ బతికి బట్టకడితే నిన్ను చూస్తాను. అమ్మా నేను చాలా ప్రేమిస్తున్నాను. ఏమో నేను ఈ మావోయిస్టుల దాడిలో చచ్చిపోతానేమో. పరిస్థితి చాలా దారుణంగా వుంది. మృత్యువు నా కళ్ళ ముందు వుందమ్మా. అయినా నాకు భయం వేయటంలేదు. నేను తప్పించుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. నాతోపాటు ఆరెడుగురు పోలీసులు వున్నారు. నాలుగు దిక్కుల నుంచి వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. అయినా నేను ధైర్యంగా వొకే మాటంటాను, చావంటే భయం లేదు…’
వీడియోలో అచ్యుతానంద సాహు మాట్లాడినంత సేపు మావోయిస్టుల తుపాకుల మోతలు వినిపిస్తుంటాయి. సినీఫక్కీని తలపిస్తుంది ఆ వీడియో. అతను మాట్లాడుతుండగానే మావోయిస్టులు అతనిమీద దాడి చేశారని భావిస్తున్నారు పోలీసులు.