ఎన్.టి.ఆర్ సినిమాలో సీనియర్ నటి

SMTV Desk 2018-10-25 10:40:05  NTR, NTR Biopic, Aamani,

హైదరాబాద్, అక్టోబర్ 25: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో ఇప్పటికే స్టార్ కాస్ట్ అంతా సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే జీవిత చరిత్ర కాబట్టి ఎన్.టి.ఆర్ రెండో పెళ్లి గురించి కూడా చూపించాల్సి ఉంటుంది. దాన్ని చూపించకుండా బయోపిక్ పూర్తి చేసినా అపవాదాలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. అందుకే బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాలో లక్ష్మి పార్వతి పాత్ర కూడా రాసుకున్నారట.

ఈ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ సీనియర్ నటి ఆమనిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ, ఆమని కలిసి రెండు దశాబ్ధాల క్రితం వంశానికొక్కడు సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కలిసి నటిస్తున్నారు. మరి ఈ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. ఓ పక్క లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో లక్ష్మి పార్వతిగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉండగా. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో మాత్రం శ్రీరెడ్డి లక్ష్మి పార్వతిగా నటిస్తుందని సమాచారం.