సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్

SMTV Desk 2018-10-23 13:41:30  rahul gandhi,congres,skeening commity

న్యూఢిల్లీ అక్టోబర్ 23: దేశ వ్యాప్తంగా కుల ప్రాతిపదిక ఉద్యమాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగొచ్చింది.సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తూ అన్ని సామాజిక వర్గాలకు టెకెట్లు కేటాయించాలన్న రాహుల్ నిర్ణయం పై స్కీనింగ్ కమిటీ కసరత్తు ప్రారంభించింది.ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని వివిధ కమిటీలను ఆదేశించింది. అందులో భాగంగానే సోమవారం ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, వోబీసీ విభాగాలకు చెందిన నేతలతో వేర్వేరుగా, ఉమ్మడిగా చర్చలు జరిపింది. పలు సామాజికవర్గాలపై ఆరా తీసింది. జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటయించాలని వోబీసీ విభాగం నేతలు కోరారు. ఎస్సీ సామాజికవర్గం తరుపున టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌ భట్టి విక్రమార్క, మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌ దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి అద్దంకి దయాకర్‌, ఎస్టీ విభాగం నుంచి సీతక్క, బెల్లయ్యనాయక్‌, బలరాంనాయక్‌, జగన్‌లాల్‌, రవీంద్రనాయక్‌, రేగ కాంతారావు, వోబీసీ విభాగం నుంచి మధుయాస్కీ, కత్తి వెంకటస్వామి, నాగయ్య, మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉన్నారు.కాగా ఇప్పుడు లంబాడీలు,ఆదివాసీలకూ అవకాసం కల్పిస్తుందన్న వార్తలోచ్చాయ్.రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలలో బీసీలకు 45 సీట్లు ఇవ్వగా, ఎస్సీలకు 19 స్థానాల్లోనూ మాల,మాదిగలకు సమాన స్తాయిగా సీట్లు ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.