రాంగోపాల్‌ వర్మ #MeToo

SMTV Desk 2018-10-12 14:53:46  ME TOO , RAM GOPAL VARMA .

ప్రస్తుతం దేశంలో మీటూ ఉద్యమం చర్చనీయాంశమైన అంశంగా మారింది. పదేళ్ల క్రితం హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. దీంతో భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా మీటూపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటెకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసి ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. నానా పటేకర్‌ షార్ట్ టెంపర్ వ్యక్తి అని కానీ వేధించాడంటే మాత్రం తను నమ్మనని యూట్యూబ్‌లో ఓ వీడియో ద్వారా స్పష్టం చేశాడు.