20వ సినిమా లో ‘జాన్’ గా ప్రభాస్ !

SMTV Desk 2018-10-12 12:32:35  jaan , prabhas , pooja hegde ,radhakrishna ,

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. అత్యధిక శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా చేస్తూనే ప్రభాస్ తన 20వ సినిమాను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అద్భుత ప్రేమ కథా చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఇటలీలో ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ స్టార్ హీరో కనిపిస్తాడట. ఇటీవల ఈ చిత్రానికి ‘అమూర్’ అనే ఫ్రెంచ్ టైటిల్‌ను ఖరారు చేశారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ‘జాన్’ అనే మరో టైటిల్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. ప్రియురాలిని ఎంతో ఇష్టంగా పిలుచుకునే మాట ఇది. ‘జాన్’ టైటిల్‌ను గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు రిజిస్టర్ చేయించాయట. ‘సాహో’లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా… ప్రభాస్ 20వ చిత్రంలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయిక. ఇక ప్రభాస్, పూజ రొమాన్స్ హాట్‌హాట్‌గా ఉంటుందని అంటున్నారు. వారి ప్రేమ సన్నివేశాలు యూత్‌ను మైమరపిస్తాయట.