అన్నపూర్ణ లో సందడి చేసిన విరాట్ కోహ్లీ

SMTV Desk 2018-10-10 17:33:46  annaporna studio, virat kohli , akkineni akhil

హైదరాబాద్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. రెండో టెస్టు కోసం టీమ్‌ ఇండియా, వెస్టిండీస్‌ జట్లు నిన్న హైదరాబాద్‌ చేరుకున్నాయి. టెస్టు‌ నిమిత్తం కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లారు. స్టూడియోస్‌లో ఆయనపై ఓ ప్రకటనను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఈ సందర్భంగా కోహ్లీ, అక్కినేని అఖిల్‌తో కలిసి సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభంకానుంది.మరోపక్క విరాట్‌ భార్య అనుష్క ‘సుయీ ధాగా’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడంతో భర్తతో కలిసి మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అనుష్క నటించిన ‘జీరో’ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ మరో కథానాయికగా నటించారు. ఆనంద్‌ ఎల్.రాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.